![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం ముగిసింది. ఫస్ట్ వీక్ లోనే ఎన్నో గొడవలు, టాస్క్ లు, అల్లర్లు కంప్లైంట్లు, బ్యాక్ బిచ్చింగ్, ఇలా ఎన్నో భరించి చివరికి ఒకరు బయటకొచ్చేశారు. తనే శ్రష్టి వర్మ. ఎన్నో అంచాలతో హౌస్‌లోకి అడుగుపెట్టిన కొరియోగ్రాఫర్ శ్రష్టి ఊహించని విధంగా మొదటి వారమే బైబై చెప్పేసింది. అయితే వెళ్తూ వెళ్తూ హౌస్‌లో ముగ్గురి మెడలో ఫేక్ అంటూ బోర్డులు వేసింది. అలానే సుమన్ శెట్టికి కూడా పెద్ద షాకే ఇచ్చింది. మరి శ్రష్టి ఎవరిని ఫేక్ అని చెప్పింది.
హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యాక స్టేజ్ మీదకి వచ్చింది శ్రష్టి. ఇక వచ్చాక తన జర్నీ వీడియోని చూపించాడు నాగార్జున. అది చూసి కాస్త ఎమోషనల్ అయింది శ్రష్టి. హౌస్ లో నలుగురు జెన్యూన్.. నలుగురు కెమెరా ముందు యాక్ట్ చేసే వాళ్ల లిస్ట్ ఇచ్చేసి వెళ్లిపోమంటూ నాగార్జున అన్నాడు. జెన్యూన్ లిస్ట్‌లో రాము రాథోడ్ పేరు చెప్పింది శ్రష్టి. అతను చాలా ఇన్నోసెంట్.. నా టామ్ అంటూ శ్రష్టి చెప్పింది. తర్వాత మర్యాద మనీష్, హరిత హరీష్ పేర్లు చెప్పింది. మనీష్ చాలా జెంటిల్‌మ్యాన్, హరీష్ మనసున్న వ్యక్తి అంటూ చెప్పింది. ఆ తర్వాత చివరిగా ఫ్లోరా పేరు చెప్తూ ఆమె పెయిన్ నాకు అర్థమవుతుంది.. తను చాలా మంచి సోల్ అంటూ చెప్పింది. కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉండే వ్యక్తులు అనగానే ఫస్ట్ రీతూ చౌదరి పేరు చెప్పింది శ్రష్టి. తర్వాత తనూజ పేరు కూడా తీసింది. సంజన గారు ఎగ్ కొట్టేసినప్పుడు నేను డైరెక్ట్‌గా వెళ్లి తనూజ అక్కని అడిగా.. కానీ నాకు తెలియదని ముఖం మీద చెప్పింది. అలా నమ్మకం పోగొట్టుకుందంటూ శ్రష్టి క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత భరణి పేరు చెప్తూ శ్రష్టి ఎమోషనల్ అయింది.
ఇప్పుడు చెప్తున్న పేరు నాకు ఇష్టం లేదు కానీ చెబుతున్నా.. ట్రస్ట్. ఒక్కసారి నమ్మకం పోతే అది మళ్లీ రాదు లైఫ్ లాంగ్ రాదు.. ఐయామ్ సారీ భరణి అన్నా కానీ అక్కడ నేను బ్రేక్ అయిపోయాను అన్నానంటూ శ్రష్టి ఎమోషనల్ అయింది. దీంతో ఐలవ్యూ శ్రష్టి.. అంటూ భరణి కూడా ఎమోషనల్ అయ్యాడు. చివరగా వెళ్లేటప్పుడు నాగార్జున మరో ప్రశ్న అడిగాడు. నువ్వు వెళ్తూ వెళ్తూ హౌస్‌లో ఒకరిపై బింగ్ బాంబ్ వేయాల్సి ఉంటుంది. నువ్వు ఇప్పటివరకూ చేసిన క్లీనింగ్ టాస్క్ ఎవరో ఒకరికి ఇవ్వాలని నాగార్జున అన్నాడు. దీంతో టెనెంట్స్‌లో ఉన్న సుమన్ శెట్టి పేరు చెప్పింది శ్రష్టి. సుమన్ అన్న ఖాళీగానే ఉన్నారు కదా ఆయన చేస్తారని శ్రష్టి అనడంతో.. తను సరే అన్నట్లుగా చేయి ఎత్తాడు. ఇక హౌస్ అందరికి బైబై చెప్పేసి వెళ్ళిపోయింది శ్రష్టి.
![]() |
![]() |